కాలిబాటన తిరుమల కొండెక్కనున్న జగన్..

0
84

వైఎస్సార్ సిపి అధినేత జగన్మోహన్  రెడ్డి పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుమలలో వెంకటేశ్వర స్వామి  దర్శనం చేసుకోనున్నారు. ఈ మేరకు పాదయాత్ర ముగిసిన మరుసటి రోజే జగన్ తిమలకు బయలేదేరి శ్రీవారిని దర్శించుకోన్నట్లు వైఎస్సార్ సిపి ముఖ్య నాయకులు తెలిపారు.

2017 నవంబర్ 3 న వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించారు. ఆ యాత్రకు ముందు జగన్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఇలా 14 నెలల పాదయాత్ర అనంతరం మళ్లీ తిరుమలకు వెళ్లనున్న ఆయన… అలిపిరి నుండి కాలిబాటన ఏడుకొండలు ఎక్కనున్నారు. ఇలా జగన్ స్వామివారిని దర్శించుకోనున్నారు.

ఈ నెల 9వ తేదీన ఇచ్చాపురంలో జగన్ పాదయాత్ర పూర్తి కానుంది. అక్కడ నిర్మించిన భారీ ఫైలాన్ ఆవిష్కరించడంతో పాటు వైఎస్సార్ సిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆంద్ర ప్రదేశ్ లోని మొత్తం జిల్లాల మీదుగా దిగ్విజయంగా ముందుకు  సాగిన పాదయాత్ర  ఇచ్ఛాపురం భారీ బహిరంగ సభతో ముగియనుంది.

ఇప్పటికే ఇచ్చాపురంలో నిర్మిస్తున్న ఫైలాన్ పనులు చివరి దశకు చేరుకున్నారు. అలాగే బహిరంగ సభ జరిగే ప్రాంగణాన్ని గుర్తించి…అక్కడ సభకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో వైఎస్సార్ సిపి ముఖ్య నాయకులు నిమగ్నమయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here