‘ఎఫ్ 2’: ఫ్యాన్స్ వార్… క్రెడిట్ ఏ హీరోకి చెందాలి?

0
125

ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ చిత్రాలు వరుసగా పెట్టాయి.  కథ బాగుంటే సీనియర్ హీరోలతో కలిసి, యంగ్ హీరోలు ఎలాంటి అభ్యంతరం లేకుండా నటించేస్తున్నారు. ఈ  మల్టీస్టారర్ చిత్రాల్లో ఎక్కువగా విక్టరీ వెంకటేష్ కనిపిస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కళ్యాన్, రామ్ లాంటి హీరోలతో నటించిన వెంకి తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ‘ఎఫ్ 2’ చిత్రంలో నటించారు.  అనిల్ రావిపూడి  డైరక్ట్ చేసిన ఈ చిత్రం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

అయితే ఇప్పుడు ఇదే పెద్ద సమస్య తెచ్చి పెట్టింది. ఈ సినిమా క్రెడిట్ ఎవరికి ఇవ్వాలనేది ఫ్యాన్స్ మధ్య వార్ కు దారి తీస్తోంది. సోషల్ మీడియాలో ఈ యుద్దం ఆల్రెడీ మొదలైంది. మెగా ఫ్యాన్స్ ఈ క్రెడిట్ ని తమ ఖాతాలోనే వెయ్యాలంటున్నారు. ఈ సినిమాకన్నా ముందే వరుణ్ తేజ్ ..తొలి ప్రేమ వంటి సూపర్ హిట్ ఇచ్చి ఉన్నాడని, అతని ఛరిష్మాతోనే మంచి ఓపినింగ్స్ వచ్చాయని చెప్తున్నారు.

అదే సమయంలో వెంకటేష్ ఫ్యాన్స్ సైతం వాదన మొదలెట్టారు. వెంకటేష్ లేకుండా అసలు ఆ సినిమాని ఊహించగలరా అంటున్నారు. వెంకటేష్ మొత్తం ఈ సినిమాని తన భుజాలపై మోసాడని, కావాలంటే రివ్యూలు చూసుకోండి..పబ్లిక్ టాక్ వీడియోలు చూసుకోండి అంటూ సవాల్ విసురుతున్నారు.

అయితే వెంకటేష్ లేకపోతే ఈ సినిమా ఆ స్దాయి విజయం సాధించేది కాదు అన్నది నిజమే కానీ..వరుణ్ తేజ్ కూడా తనదైన టైమింగ్ తో సినిమాని నిలబెట్టాడు అనేది నిర్విదాంశం. అన్నిటికన్నా ముఖ్యంగా దర్శకుడు అనీల్ రావిపూడి ప్రతిభ, ఫన్ టైమింగ్ ఈ సినిమా ఘన విజయానికి ప్లస్ అయ్యిందనే విషయం మర్చిపోకూడదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here