పంచాయతీ ఎన్నికలు: ఎవరు అర్హులు

0
156

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ల తేదీలు ఖరారయ్యా యి. దీంతో సర్పంచ్‌, వార్డు మెంబర్‌ స్థానాలకు పోటీ చేయాలని ఆశిస్తున్నవారు ఎన్నికలకు రెడీ అవుతున్నారు. ఎన్నికల్లో పోటీకి దిగాలంటే కొన్ని విషయాలు, రూల్స్‌ తెలుసుకోవాల్సిందే.

గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీరహితంగా జరుగుతాయి. రాజకీయ పార్టీ గుర్తులు ఉండవు. ఎన్నికల కమిషన్‌ ఎంపిక చేసిన గుర్తు లనే అభ్యర్థులకు వారి పేర్లతో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో కేటాయిస్తారు. ఎంపిక చేసిన గుర్తులతో కూడిన బ్యాలెట్‌ ‌‌‌పేపర్లను ఇప్పటికే ఫ్రింట్ చేసి రెడీగా ఉంచారు.

1995, మే 31 కంటే ముందు ఎంత మంది సంతానం ఉన్నా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. కానీ ఆ తేదీ తర్వాత ముగ్గురు సంతానం కలిగిన వారు పోటీకి అనర్హులు. ఇందులో మొదట కవల పిల్లలుండి , తర్వాత మరో సంతానం కలిగిన వారు పోటీ చేయడానికి కుదరదు. అదే మొదట ఒక సంతానం ఉండి, తర్వాత కవలలు పుడితే పోటీకి చేసేందుకు చాన్స్‌ ఉంటుంది. ఇద్దరు భార్యలు ఉండి, ఇద్దరికి కలిపి ముగ్గురు, అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు అనర్హులు.

ప్రభుత్వ ఉద్యోగులు, 25 శాతం ప్రభుత్వ భాగ స్వామ్యం ఉన్న సంస్థల్లో పని చేస్తున్నవారికి అవకాశం లేదు. సర్పంచ్‌, వార్డు మెంబర్‌ పదవులకు పోటీ చేయదలచుకున్న అభ్యర్థులు సంబంధిత గ్రామ ఓటరై ఉండాలి. ఓటరు లిస్టులో పేరులేకుంటే పోటీ చేయడం కుదరదు. సర్పంచ్‌ పదవికి నామినేషన్‌వేసే అభ్యర్థిని గ్రామంలోని ఏ వార్డు ఓటరైనా ప్రపోస్‌ ‌‌‌చేయొచ్చు. వార్డు మెంబర్‌ పదవికి పోటీచేసే అభ్యర్థిని మాత్రం సేమ్‌‌‌‌‌‌‌‌వార్డు ఓటరు మాత్రమే ప్రపోస్‌‌‌‌ చేయాలి. వార్డు మెంబర్‌ అభ్యర్థులు ఎన్ని వార్డులకు అయినా నామినేషన్‌ వేయొచ్చు. కానీ ఒక వార్డు స్థానంలో మాత్రమే పోటీ చేసేందుకు అవకాశం ఉంటుంది. సర్పంచ్‌, వార్డుమెంబర్‌ పదవులకు పోటీచేసే అభ్యర్థులకు ఇంటి పన్ను, నల్లాబిల్లు, కరెంటు బిల్లు, భూమి పన్ను బకాయిలుండొద్దు.

ప్రతి గ్రామానికి ఒక రిటర్నింగ్‌ ఆఫీసర్‌

పంచాయతీ ఎన్నికల కోసం ప్రతి గ్రామానికి ఒక రిటర్నింగ్‌ ఆఫీసర్‌ (ఆర్వో) ఉంటారు. ఆర్వోలపైన ఎంపీడీవోలు అసిస్టెంట్‌‌‌‌ డిస్ట్రిక్ట్‌‌‌‌ ఎలక్షన్‌ అథారిటీగా వ్యవహరిస్తారు. జిల్లాపరిధిలో ఎలక్షన్‌ అథారిటీగా జిల్లా కలెక్టర్, అదనపు ఎలక్షన్‌ అథారిటీగా డీపీవో,జాయింట్ కలెక్టర్, డిప్యూటీ ఎలక్షన్‌ అథారిటీగా ఆర్డీవోలు విధులు నిర్వహిస్తారు. నామినేషన్లస్వీకరణ, స్క్టినీ, ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్‌, ఫలితాల వెల్లడి, ఉప సర్పంచ్‌ ఎన్నిక వంటివన్నీ రిటర్నింగ్‌ అధికారి చేస్తారు. ఎన్నికల పర్యవేక్షణ కోసం రాష్ట్రఎన్నికల సంఘం 26 మంది IAS ‌‌‌అధికారులను జనరల్‌ ‌‌‌అబ్జర్వర్లుగా నియమించింది. ఎన్నికల కోసం రాష్ట్రప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here