నాలుగో టెస్ట్‌: టీమిండియా జట్టు

0
256

సిడ్నీలో రేపటి(గురువారం) నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టెస్టు కోసం 13 మంది సభ్యులతో భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఇషాంత్ శర్మకు ఫిట్ నెస్ లేదన్న BCCI… జట్టు నుంచి తప్పించింది. అడిలైడ్‌లో జరిగిన మొదటి టెస్టులో పార్శపు నొప్పితో జట్టుకు దూరమైన అశ్విన్‌కు అవకాశం దక్కింది.

రెండు, మూడు టెస్టులు ఆడలేకపోయిన అతడికి చివరి టెస్ట్‌లో ఛాన్స్‌ ఇచ్చారు. అశ్విన్‌ తుది జట్టులో ఉంటాడా… లేదా అనేది మ్యాచ్‌ ప్రారంభానికి ముందు నిర్ణయిస్తామని తెలిపింది. వ్యక్తిగత కారణాలతో రోహిత్‌ శర్మ నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. తనకు కూతురు పుట్టడంతో అతడు స్వదేశానికి వచ్చాడు. చివరిదైన సిడ్నీ టెస్టులో పైచేయి సాధించి చరిత్ర సృష్టించాలని టీమిండియా రెడీ అవుతోంది. ఈ మ్యాచ్ లో గెలిచినా..ఓడినా సిరీస్ మాత్రం ఇండియాదే.

టీమిండియా జట్టు:

విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), అజింక్య రహానే(వైస్‌ కెప్టెన్‌), ఛతేశ్వర్‌ పుజారా,KL రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, హనుమ విహారి, రిషబ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమి, జస్ప్రిత్‌ బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here