సిడ్నీ టెస్ట్: మ్యాచ్ డ్రా, ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత్

0
68

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్‌ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్‌ డ్రా అయ్యింది. వర్షం కారణంగా మ్యాచ్ కొనసాగించేందుకు అవకాశం లేకపోవడంతో అంపైర్లు ఐదో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో మ్యాచ్ డ్రా గా ముగిసింది.

దీంతో భారత్ 2-1 తేడాతో ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆసీస్ గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ విజయం సాధించి టీమిండియా చరిత్ర సృష్టించింది. నిన్న రెండో ఇన్నింగ్స్‌ ఆడుతున్న ఆసీస్ ఆట ముగిసే సమయానికి 6 పరుగులు చేసింది.

క్రీజులో ఖవాజా, హారిస్ ఉన్నారు. అంతకు ముందు భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 622 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ 300 పరుగులకు అలౌటై ఫాలో ఆన్ ఆడుతోంది.

దాదాపు 3 దశాబ్ధాల తర్వాత ఆస్ట్రేలియా జట్టు ఫాలో ఆన్ ఆడటం గమనార్హం. విజయంతో ఘనంగా సిరీస్‌ను ముగించాలనుకుంటున్న కోహ్లీసేనకు వాతావరణమే పెద్ద అడ్డంకిగా మారింది. 3-1 ఆశలకు గండికొట్టేలా ఉంది. వర్షం, వెలుతురులేమి కారణంగా సిడ్నీ టెస్టులో ఆదివారం 25.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here