సూపర్ కారు: రోడ్డు లేకున్న కొండలెక్కేస్తుంది

0
38

మీరు స్టార్‌ వార్స్‌ మూవీ చూశారా? అందులో కార్లు రయ్‌ రయ్‌ మంటూ దూసుకెళ్లడం మానేసి , కొండలపై వాకింగ్‌ చేస్తూ వెళ్తాయ్‌ ! ఆ గ్రాఫిక్‌‌‌‌ ఊహకు జంతువులు, పాములే ప్రేరణగా హ్యుందాయ్‌ ప్రాణం పోసింది. లాస్‌ వేగాస్‌ లో జరుగుతున్న సీఈఎస్‌ ఈవెంట్‌‌‌‌లో వాటిని ప్రదర్శించింది. ఎత్తైన ప్రదేశాలను ఈజీగా ఎక్కేయడం, 5 అడుగులు ఎత్తుండే గోడలపై నుంచి జంప్ చేయడం, మెట్లపైకి గబగబ ఎక్కేసి పాసింజర్లను తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న దీనికి ‘‘ఎలివేట్‌‌‌‌’’ అని పేరు పెట్టారు.

సునామీలు, భూకంపాల సమయంలో శిథిలాలపై ఎక్కి బాధితులను రక్షించడానికిఉపయోగపడుతుందని తెలిపింది. దివ్యాంగులు మెట్లు దిగే పని లేకుండా, పైకి వెళ్లి వాళ్లని ఎక్కించుకుని గమ్య స్థానంలో భద్రంగా దిగబెడుతుందని వివరించింది. అవసరానికి తగినట్టు కాళ్లను లోపలికి ముడుచుకోవడం, చక్రాలుగా మార్చడం, స్తంభాల్లా మార్చి ఐస్‌ లో నడవడం వంటివి అలవోకగా చేస్తుందట. వీటికి వెపన్స్‌ను జత చేయడం ద్వారా కొండ, మంచు ప్రాంతాల్లో బలగాలూ వాడుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here