అయ్యప్ప గుడిలోకి శ్రీలంక మహిళ… కేరళలో ఆగని నిరసనలు

0
123

శబరిమల ఆలయంలోకి గురువారం రాత్రి మరో మహిళ ప్రవేశించింది. నలభయ్యేళ్ల వయసున్న మహిళలు బిందు అమ్మిని, కనకదుర్గ తర్వాత అయ్యప్ప గుడికి వెళ్లిన మూడో మహిళ ఈమె. ఆమె పేరు శశికళ. శ్రీలంకకు చెందిన ఈ మహిళ వయసు 46 ఏళ్లు.

గురువారం రాత్రి శశికళ శబరిమలలోని అయ్యప్ప గుడికి చేరుకున్నారు. దైవదర్శనం కోసం వచ్చే మహిళలకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వం చేసిన ఆదేశాల ప్రకారం.. పోలీసులు దగ్గరుండి దర్శనం కల్పిస్తున్నారు. అలా.. భద్రత నడుమ శశికళ గుడికి చేరుకున్నారు. 18 మెట్లు ఎక్కారు. ప్రధాన ఆలయంలోకి వెళ్లేందుకు శశికళ ప్రయత్నించినప్పటికీ అక్కడ భక్తులు అడ్డుచెప్పారు. ఆ తర్వాత దీనిపై స్పందించిన పోలీసులు… నిరసనల మధ్య ఆ మహిళకు దర్శనం కల్పించామని ప్రకటించారు.

గుడికెళ్లాను.. దర్శనం చేసుకోలేదు : శ్రీలంక భక్తురాలు శశికళ

ఐతే… తాను గుడికి వెళ్లినప్పటికీ.. అయ్యప్ప దర్శనం చేసుకోలేకపోయానని శశికళ చెప్పింది. తనకు గర్భసంచి తొలగించారని… అందుకు మెడికల్ ప్రూఫ్ కూడా ఉందని తెలిపింది. 48 రోజుల పాటు కఠినమైన దీక్ష చేసి వచ్చానని ఆమె వివరించింది. అయ్యప్ప గుడిలోకి వెళ్లేందుకు ఉన్న.. అన్ని రకాల నియమ నిబంధనలు తాను లోబడి ఉన్నానని ఆమె చెప్పింది.

మరోవైపు.. నిరసనలు జరుగుతున్నా మహిళల దర్శనాలకు అనుమతివ్వడాన్ని వ్యతిరేకిస్తూ… శబరిమల కర్మసమితి, బీజేపీ, హిందూత్వ సంస్థలు ఆందోళనలు చేస్తున్నాయి. సడక్ బంద్ లో పాల్గొంటున్నాయి. పలుచోట్ల అధికార, ప్రతిపక్ష కార్యకర్తల మధ్య ఘర్షణలు ఇంకా కొనసాగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here