సంక్రాంతి స్పెషల్: పండుగకు ప్రత్యేకంగా 124 రైళ్లు

0
84

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టింది దక్షిణ మధ్య రైల్వే. సొంత గ్రామాలకు వెళ్లే లక్షలాది మంది ప్రయాణికుల కోసం వివిధ ప్రాంతాలకు 124 స్పెషల్‌ ‌‌‌ట్రైన్స్‌ నడపనుంది. ఇందులో ఎక్కువ రైళ్లు ఆంధ్రప్రదేశ్ కు వెళ్లనున్నాయి. ఇప్పటికే ఆయా రైళ్లలో టికెట్‌ రిజర్వేషన్లన్నీపూర్తయ్యాయి.

ఈ నెల 5 నుంచి 25వ తేదీ వరకు 124 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 11,12 తేదీల్లో రైళ్లు కిక్కిరిసి పోనున్నాయి. సికింద్రాబాద్‌ నుంచి దర్భంగకు ఈ నెల 5,8,12,15,19,22 తేదీల్లో, కాకినాడ టౌన్‌‌‌‌ నుంచి కర్నూల్‌‌‌‌ టౌన్‌‌‌‌కు 8,10,15,17,22,24 తేదీల్లో, కర్నూలు టౌన్‌‌‌‌ నుంచి కాకినాడ టౌన్‌‌‌‌కు 9,11,16,18,23,25 తేదీల్లో, కాకినాడ టౌన్‌‌‌‌ నుంచి రాయచూర్‌కు 6,9,11,16,18,20,23,25 తేదీల్లో, రాయచూర్‌ నుంచి కాకినాడ టౌన్‌‌‌‌కు 5,7,10,12,14,17,19,21,24 తేదీల్లో, హైదరాబాద్‌ నుంచి -రాక్సల్‌‌‌‌కు 10,17,24 తేదీల్లో, కాచిగూడ నుంచి- కాకినాడ పోర్ట్‌‌‌‌కు ర్ట్‌‌‌‌ 5,12,19 తేదీల్లోఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఇవే కాకుండా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, కాచిగూడ నుంచి ఆయా ప్రాంతాలకు వివిధ రైళ్లుబయలుదేరనున్నాయి. గతేడాది దక్షిణ మధ్య రైల్వే డివిజన్‌‌‌‌పరిధిలో 134  రైళ్లను అధి కారులు నడిపారు.

సంక్రాంతి పండుగ సమయంలో 23 సువిధ, 6 జనసాధారణ్‌ రైళ్లు నడపనున్నారు. సికింద్రాబాద్‌, కాచిగూడ, హైదరాబాద్‌, విజయవాడ, కాకినాడ టౌన్‌‌‌‌, నాగర్‌సోల్‌‌‌‌, మచిలీపట్నం నుంచి ఈ రైళ్లు ప్రారంభంకానున్నాయి. మిగతా రైళ్లతో పోల్చితే సువిధ రైళ్లలో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది.

చార్జీల పెంపును నాలుగు స్లాబులుగా విభజించారు. మొదటి, రెండో స్లాబులో సాధారణం కంటే స్వల్పంగా పెంచగా, నాలుగో స్లాబులో టికెట్‌పై రెండు నుంచి మూడు రెట్లు అధికంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్‌ ధర రూ.10 నుంచి రూ.20కి పెంచారు. మరోవైపు సంక్రాంతి పండుగ సందర్భంగా అన్ని రైళ్లలోనూ ఇప్పటికే టికెట్‌ బుకింగ్‌రిజర్వేషన్లు నిండిపోయాయి. ఈ నెల 5 నుంచి నడపనున్న ప్రత్యేక రైళ్లలోనూ దాదాపు రిజర్వేషన్లు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. సువిధ ట్రైన్స్‌‌‌‌లో మాత్రం కొన్ని ఖాళీలు ఉన్నాయన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here