‘స్పేస్‌ మానిటర్‌’: టేబుల్‌‌‌‌ ఎడ్జ్ కు తగిలిస్తే సరిపోతుంది

0
93

ఇంట్లో కంప్యూటర్ పెట్టుకోవాలంటే ఒక సెట్టింగ్ అవసరం. టేబుల్ పై మానిటర్…పక్కనే సీపీయూ. రెండు సెట్ చేయడంతోనే ఆ టేబుల్ నిండిపోతుంది. ఈ తర్వాత మానిటర్లలో చాలా మార్పులు వచ్చాయి. మార్కెట్ లోకి ఫ్లాట్‌ LEDలు వచ్చాయి. అయినా వాటికి కూడా చాలా స్పేస్ కావాలి. టేబుల్‌ ఫ్రీగా ఉంటూ ఆ స్పేస్‌‌‌‌ను కావాల్సినట్టుగా వాడుకుంటే బాగుంటుంది కదా. ఆ ఆలోచనతోనే శాంసంగ్‌ ఈ ‘స్పేస్‌ మానిటర్‌’ను తయారు చేసింది.

దీన్ని టేబుల్‌ మీద పెట్టాల్సిన అవసరం లేదు.. టేబుల్‌ ఎడ్జ్‌కు జస్ట్‌‌‌‌ తగిలిస్తే చాలు. ఆ టేబుల్ మిగతా ప్లేస్ ను ఫుల్ గా వాడేసుకోవచ్చు. ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఫైల్స్‌‌‌ కూడా అక్కడే పెట్టుకోవడంతో పాటు…ఫ్రీగా పనిచేసుకోవచ్చు. మానిటర్‌‌‌‌ను టేబుల్ ఎడ్జ్ కు తగిలించుకోవడమే కాదు…అవసరమైతే కిందకు జరుపుకోవచ్చు. అంటే మన చూపునకు తగినట్టు అడ్జస్ట్‌‌‌‌ చేసుకోవచ్చన్నమాట. 45 డిగ్రీల కోణంలో టేబుల్‌కు ఆనేలా కూడా పెట్టుకోవచ్చు. టేబుల్‌కు తగిలించుకోవడమే కాదు.. అవసరమైతే ఎంచక్కా గోడకూ పెట్టేసుకోవచ్చు. దీనికి సంబంధించి రెండు మోడళ్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది శాంసంగ్‌.

27 అంగుళాల క్యూహెచ్‌‌‌‌డీ (2560/1440) ఒక మోడల్‌ కాగా, 32 అంగుళాల 4కే వన్‌ (3840/2160) మరో మోడల్‌. 27 అంగుళాల మానిటర్‌తో పోలిస్తే 32 ఇంచుల మానిటర్‌ రిఫ్రెషింగ్‌ రేట్‌ చాలా తక్కువ. దానిది 144 హెడ్జ్ లయితే… పెద్ద దానిది జస్ట్‌‌‌‌ 60 హెడ్జులే. దీని ధర సుమారు రూ.34,700. అమెరికాలో నిర్వహిస్తున్న కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌‌‌‌ షోలో దీన్ని ప్రదర్శనకు పెట్టారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here