బిగ్ బాస్2 బ్యూటీకి మెంటల్ స్ట్రెస్!

0
104

టాలీవుడ్ పాపులర్ సెలబ్రిటీస్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న భామ బిగ్ బాస్ సీజన్ 2లో పార్టిసిపెంట్ గా వెళ్లింది. ఈ షోకి వెళ్లిన తరువాత ఆమెని అభిమానించే వారితో పాటు ద్వేషించే వారు కూడా పెరిగారు.

తాజా సమాచారం ప్రకారం ఈ బ్యూటీ మానసిక ఒత్తిడితో బాధ పడుతుందని, దానికోసం మానసిక నిపుణుడిని కూడా సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ 2 షో పూర్తయిన తరువాత ఆమె టాలీవుడ్ లో బిజీ అయిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె బయట చాలా తక్కువగా కనిపిస్తోంది.

ఆమెకు ఆరోగ్యం బాగాలేదని, హోమ్ సిక్ అని అనుకున్నారు. కానీ అసలు విషయం మరొకటి ఉందట. ప్రతిరోజు ఉదయం ఆమె బెడ్ మీద నుండి లేవాలంటే పెద్ద సౌండ్ తో బిగ్ బాస్ లో వినిపించినట్లు ఓ పాట వినిపించాల్సిందేనట. ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులను ఆందోళనకి గురి చేస్తోంది.

లేచిన తరువాత ఆమె ఈరోజు టాస్క్ లు ఏంటి అంటూ బిగ్ బాస్ భాషలో మాట్లాడడంతో మొదట జోక్ చేస్తుందని అనుకున్నారట. కానీ ఆమె ప్రవర్తనలో మార్పు రావడంతో హైదరాబాద్ లో ఓ సైకియాట్రిస్ట్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత కూడా ఆమె షోని మర్చిపోవడం లేదు. ఈ మేరకు ఆమెకి డాక్టర్ తో  కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here