రికార్డ్ బ్రేక్: ధోనీ వల్ల కానిది పంత్ సాధించాడు

0
280

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. బౌండరీలు, సిక్సర్లతో వన్డే తరహా బ్యాటింగ్‌ చేశాడు.

ఇతని ధాటికి స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. మరోవైపు అతని జోరుకు పలు రికార్డులు బద్ధలయ్యాయి. ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది టెస్టుల్లో పంత్‌కిది రెండో సెంచరీ. గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన పంత్.. శుక్రవారం సిడ్నీలో రెండో సెంచరీతో అరుదైన ఘనత సాధించాడు.

ఆసీస్ గడ్డపై శతకం బాదిన తొలి భారత వికెట్ కీపర్‌గా పంత్ చరిత్ర సృష్టించాడు. జార్ఖండ్ డైనమెట్, టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి సైతం ఇక్కడ సెంచరీ సాధ్యపడలేదు. అలాగే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలలో సెంచరీలు చేసిన పర్యాటక జట్టు కీపర్‌గా జెప్రీ డుజాన్ సరసన చేరాడు. అంతేకాకుండా ఒక టెస్ట్ సిరీస్‌లో 200 కంటే పరుగులు, 20 క్యాచ్‌లు అందుకున్న ఉపఖండపు తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here