ప్రేమలో మునిగితేలుతున్న రిషబ్ పంత్

0
101

టీం ఇండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రేమలో మునిగితేలుతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ లో తన బ్యాటింగ్ ప్రదర్శనతో దుమ్మురేపిన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ ఖాళీ సమయాన్ని కుటుంబసభ్యులు, స్నేహితులతో గడుపుతున్నాడు.

కాగా.. తాజాగా.. పంత్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ అమ్మాయితో కలిసి దిగిన ఫోటోని పోస్టు చేశాడు. ‘‘నేను నిన్ను సంతోషంగా ఉంచాలనుకుంటున్నాను.. ఎందుకంటే.. నా సంతోషానికి కారణం నువ్వే’ అంటూ క్యాప్షన్ కూడా జత చేశాడు. ఇంకేముంది.. ఈ ఫోటో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. జోడి  బాగుందంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

పంత్ తో పాటు ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు ఇషా నేగి. ఆమె ఎంటర్‌ప్రెన్యూర్‌, ఇంటీరియర్‌ డిజైనర్‌ కూడా. ఇషా కూడా అదే ఫొటోను షేర్‌ చేయడం విశేషం. ‘మై మ్యాన్‌, మై సోల్‌మేట్‌, బెస్ట్‌ ఫ్రెండ్‌, లవ్‌ ఆఫ్‌ మై లైఫ్‌’ అంటూ ఆమె క్యాప్షన్‌ ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here