ప్యాంట్ వేసుకోలేదని రకుల్ పై వల్గర్ కామెంట్స్!

0
592

సోషల్ మీడియా హవా పెరిగిపోయిన తరువాత నెటిజన్లు మరింతగా రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చేసే కామెంట్స్ రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. తాజాగా స్టార్ హీరోయిన్ రకుల్ పై చేసిన కామెంట్ చూస్తే ఎంతగా శ్రుతిమించిపోయారో అర్ధమవుతుంది.

రకుల్ కారు నుండి దిగుతున్న ఫోటోని తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసిన ఓ వ్యక్తి.. కారులో సెషన్ పూర్తయిన తరువాత రకుల్ ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందని వల్గర్ కామెంట్స్ చేశాడు.

ఇది చూసిన రకుల్ అతడికి దిమ్మతిరిగే సమాధానమిచ్చింది. సదరు నెటిజన్ తల్లిని ఉదాహరణగా చూపిస్తూ కామెంట్ చేసింది. ఇలాంటి మనుషులు ఉన్నంతవరకు మహిళలకు రక్షణ లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

కేవలం మానవత్వం, రక్షణ అంటూ చర్చలు జరపడం వల్ల ఉపయోగం లేదంటూ ఫైర్ అయింది. రకుల్ ఇచ్చిన సమాధానాన్ని మెచ్చుకుంటూ కొందరు ఆమె ధైర్యాన్ని అభినందిస్తుంటే.. మరికొందరు చీప్ కామెంట్స్ చేసిన నెటిజన్ ని తిట్టడానికి నువ్ కూడా ఓ మహిళను అవమానించావంటూ సెటైర్లు వేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here