ఎన్టీఆర్, చరణ్ లను పది నెలలు బుక్ చేసుకున్నాడట!

0
139

దర్శకధీరుడు రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా ‘RRR’  సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకొని మరో మూడు, నాలుగు రోజుల్లో రెండో షెడ్యూల్ మొదలుకానుంది.

అయితే ఈ సినిమాకి తారక్, చరణ్ ఎన్నిరోజులు కాల్షీట్లు కేటాయించారనే విషయంలో క్లారిటీ వచ్చింది. సాధారణంగా రాజమౌళి సినిమాలంటే హీరోల సంవత్సరాల చొప్పున డేట్స్ కేటాయిస్తుంటారు.చరణ్, తారక్ లు కూడా అలానే డేట్స్ ఇచ్చి ఉంటారని అభిమానులు అనుకున్నారు.

కానీ రాజమౌళి మాత్రం కేవలం పది నెలల వరకే తారక్, చరణ్ లను బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేయాలనేది రాజమౌళి ప్లాన్. ఈ క్రమంలో ఇద్దరి హీరోలను పది నెలల పాటు డేట్స్ కేటాయించమంది అడిగారట. ఆ పది నెలలు పూర్తయిన తరువాతే ఈ ఇద్దరు హీరోలు మరో సినిమా కమిట్ అవ్వొచ్చు.

‘బాహుబలి’ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా ఐదేళ్ల పాటు కాల్షీట్స్ ఇవ్వడంతో చరణ్, ఎన్టీఆర్ లను ఇంకెంతకాలం బుక్ చేస్తాడో అనుకున్న అభిమానులకు ఇదిఊరట కలిగించే విషయమే.. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here