ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ ట్విటర్ రివ్యూ!

0
482

మహానటుడు దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో సినిమా అంటే మామూలు విషయం కాదు.. సినిమాల పరంగా ఎంతో పేరు సంపాదించిన ఎన్టీఆర్.. రాజకీయాల పరంగా ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆయన చరిత్రను రెండు భాగాలుగా చిత్రీకరించారు. మొదటి భాగం ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్ షోలు పడగా.. ఆంధ్రప్రదేశ్ లోని తెల్లవారుజామునే షోలు మొదలైపోయాయి. ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు ట్విటర్ ద్వారా సినిమాపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్విటర్ లో మిశ్రమ స్పందన రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కొంతమంది సినిమా అధ్బుతంగా ఉందని అంటుంటే.. మరికొందరు మాత్రం ఊహించినంతగా లేదని తేల్చేస్తున్నారు.

సినిమాను బాగా సాగదీశారని, ఎన్టీఆర్ సినీ పాత్రలు మరీ ఎక్కువైపోయాయని అంటున్నారు. చాలా చోట్ల ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారని.. మనసుని హత్తుకునే సన్నివేశాలు లేవంటున్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం, తెలుగుదేశం పార్టీని అనౌన్స్ చేయడం వంటి ఎపిసోడ్స్ మాత్రం బాగున్నాయని అంటున్నారు. దివిసీమ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ గా నిలిచిందని అంటున్నారు.

సాయి మాధవ్ బుర్రా డైలాగులు, కీరవాణి సంగీతం బాగున్నాయని అంటున్నారు. ఎన్టీఆర్ గా బాలయ్య నటన సినిమాకు బలమని కామెంట్లలో రాసుకొచ్చారు. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రానా, సుమంత్, హరికృష్ణ, విద్యాబాలన్, రకుల్ వంటి తారలు నటించారు.

https://twitter.com/THEPANIPURI/status/1082782936989020160

https://twitter.com/AKKINENI_9999/status/1082790294679158784

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here