‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

0
149

భారీ రేట్లకు కొన్న సినిమాలు  విడుదల తేదీ దగ్గరపడే కొద్దీ బయ్యర్లలో భయం ప్రారంభం అవుతుంది.  కొన్నప్పుడు ఉన్న థీమా రిలీజ్ రోజు నాటికి టెన్షన్ గా టర్న్ తీసుకుంటుంది. రిజల్ట్ ఎలా ఉండబోతోంది..ఈ సినిమాకు మీడియాలో ఎలాంటి వార్తలు వస్తున్నాయి అనేవి వాళ్ల మధ్య హాట్ టాపిక్ గా మారుతుంటాయి. ముఖ్యంగా మీడియాలో వచ్చే కొన్ని కథనాలు వాళ్లను కంగారుపెడతాయి. ఎన్టీఆర్ బయోపిక్ పై మంచి నమ్మకంతో ఉన్న బయ్యర్లను కొద్దిగా టెన్షన్ కు గురి చేసిన అంశం. ఈ సినిమా సెన్సార్ పూర్తయ్యాక…వచ్చిన లెంగ్త్ రిపోర్ట్.

రీసెంట్ గా  సెన్సార్   పూర్తి చేసుకున్న ‘ఎన్టీఆర్ కథానాయకుడు’  ఏకంగా 170 నిమిషాలు అంటే 2 గంటల 50 నిమిషాల నిడివి ఉంది. ఆ లెంగ్త్ కూడా ‘నో స్మోకింగ్’యాడ్స్ లేకుండా! దాంతో ఈ చిత్రం అంత లెంగ్త్ అంటే దాదాపు మూడు గంటలు సేపు   బోర్ కొట్టించకుండా ఎంటర్టైన్ చేయగలుగుతుందా? అనే చర్చ  మీడియాలో స్టార్ట్ అయ్యింది.

అయితే అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టించదని తెలుస్తోంది. ప్రేక్షకులకు  కొన్ని తెలిసిన విషయాలు చెప్పినా, అవి తెరపై చూడటంలో ఉన్న థ్రిల్ వేరేగా ఉంటుందని అంటున్నారు. అలాగే ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన మరికొన్ని బయిటకు రాని విషయాలు ఇందులో చూపించడం జరిగిందని, అవి ఆడియెన్స్‌ని మెప్పించడం పక్కా అని  అంటున్నారు. మరీ ముఖ్యంగా కంటెంట్ ఇంట్రస్టింగ్ గా ఉన్నప్పుడు లెంగ్త్ గురించి ఆలోచించాల్సిన పనిలేదు.

ఈ చిత్రం ఔట్‌పుట్ ఔట్‌స్టాండింగ్‌గా  వచ్చిందని, ‘మహానటి’ స్థాయిలోనే ఈ మూవీ అద్భుతంగా ఉందనే రిపోర్ట్ ఉంది. దానికి తోడు బాలయ్య  గెటప్స్ తో అలరిస్తారని, ముఖ్యంగా ఎన్టీఆర్-ఏఎన్నార్ మధ్య వచ్చే సీన్లు విజువల్ ఫీస్ట్‌లా ఉంటాయంటున్నారు.  కాబట్టి భయపడాల్సిన పనిలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here