కిక్కెక్కించిన మందు: రూ.133 కోట్లు తాగేశారు

0
92

న్యూ ఇయర్ సందర్భంగా..తెలుగు రాష్ట్రాల్లోని ఎక్సైజ్ శాఖలకు భారీ ఆదాయం వచ్చింది. డిసెంబర్ 31 తెలంగాణ లో రూ.133 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగాయి. సాధారణ రోజుల్లో రూ.50 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతాయి. న్యూ ఇయర్ ( సోమవారం) ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా రూ.133 కోట్ల అమ్మకాలు జరిగాయి. అంటే దాదాపుగా రెండింతల అమ్మకాలు జరిగాయి. అయితే డిసెంబరు చివరి వారంలో రూ.600 కోట్లకుపైగా అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు  తెలిపారు.

గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఎక్కువగా లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఈ మూడు జిల్లాల్లో కలిపి రూ.120 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సిటీలో బార్ అండ్ రెస్టారెట్లు, హోటళ్లు,పబ్ లకు పర్మిషన్ ఉండటంతో ఈ సారి రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరినట్లు అధికారులు చెబుతున్నారు. గతేడాది కంటే  ఈ సారి లిక్కర్ అమ్మకాలు  ఎక్కువగా పెరిగాయంటున్నారు.

న్యూ ఇయర్ రోజు ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులు పండుగ చేసుకున్నారు. డిసెంబర్ 31న రూ.118 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఏపీలో సాధారణ రోజుల్లో రూ. 50 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతాయి. కానీ, డిసెంబరు 29 నుంచి 31 వరకు మొత్తం రూ. 289 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ చెబుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here