ఎన్టీఆర్ బయోపిక్: బాలయ్యపై నాగబాబు సెటైరికల్ కవిత!

0
98

కట్టు కథలు కొన్ని..
కల్పనలు ఇంకొన్ని..
చుట్టనేల.. మూటకట్టనేల
నిజం కక్కలేని బయోపిక్కులొద్దయ్యా
విశ్వదాభి రామ
వినరా మామ..
(కవిత్వాలు మాకూ వచ్చండోయ్)

ఈ మాటలు అంటుంది మరెవరో కాదు.. మెగాబ్రదర్ నాగబాబు. ఈ సెటైరికల్ కవిత ఎవరిమీదనో కూడా మీకు ఈ పాటికే అర్ధమై ఉంటుంది. గత కొద్దిరోజులుగా నందమూరి బాలకృష్ణని టార్గెట్ చేస్తూ నాగబాబు చేస్తోన్న వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి.

మొదట బాలకృష్ణ ఎవరో నాకు తెలియదని కామెంట్స్ చేసిన నాగబాబు, రీసెంట్ గా బాలయ్య చెప్పే మా జాతి, మా రక్తం డైలాగులను టార్గెట్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. ఈసారి మరో అడుగు ముందుకేసి తన ఫేస్ బుక్ పేజీలో ఓ కవిత పోస్ట్ చేశాడు. ఈ కవిత ద్వారా బాలయ్య నటించిన ‘ఎన్టీఆర్’ బయోపిక్ పై విమర్శలు గుప్పించాడు నాగబాబు.

కట్టు కథలు, కల్పనలు, నిజం కక్కలేని ఈ బయోపిక్కులు మాకొద్దంటూ నాగబాబు పెట్టిన పోస్ట్ పై అభిమానులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఏదైతేనేం.. నాగబాబు సెటైరికల్ కవిత మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంకా బాలయ్యపై ఎన్ని పోస్ట్ లుపెడతాడో చూడాలి!

https://www.facebook.com/NagaBabuOfficial/photos/a.281553372035503/950489125141921/?type=3&theater

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here