వణికిస్తున్న ‘మంకీ ఫీవర్’.. ముగ్గురు మృతి

0
102

కర్ణాటక రాష్ట్రాన్ని మంకీ ఫీవర్ మళ్లీ వణికిస్తోంది. శివమొగ్గ జిల్లా ఫారెస్ట్ ఏరియా నుంచి ఈ వ్యాధి విస్తరిస్తోంది. చనిపోయిన కోతులు, వాటి కలేబరాలకు దగ్గరగా ఎవరూ వెళ్లొద్దని అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి ఇప్పటికే ముగ్గురు చనిపోయారని… జ్వరాలతో బాధపడుతూ హాస్పిటల్ లో కొందరు పేషెంట్లు చికిత్స తీసుకుంటున్నారని కర్ణాటక అధికార వర్గాలు ప్రకటించాయి. మంకీ ఫీవర్ లేదా… క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ తో బాధపడుతున్నవారికి వ్యాక్సినేషన్లు పంపిణీ చేస్తున్నామని.. తప్పక వేసుకోవాలని సూచిస్తున్నాయి.

ఏంటీ మంకీ ఫీవర్ … ?

దక్షిణ భారతదేశంలో బోనెట్ జాతి కోతులు ఎక్కువగా ఉంటాయి. కర్ణాటకలోని క్యాసనూరు ఫారెస్ట్ ప్రాంతంలో వీటి మనుగడ చాలా ఎక్కువ. ఇవి చనిపోవడం వల్ల వీటి నుంచి వెలువడే వ్యాధికారకాలు మంకీ ఫీవర్ ను కలిగిస్తాయని… 1957లో గుర్తించారు. చనిపోయిన కోతుల కలేబరాల నుంచి గాలి ద్వారా ఈ వైరస్ సోకుతుంది. ఈ వైరస్ కారణంగా.. మనుషులే కాదు.. సాటి కోతులు కూడా ప్రాణాలు కోల్పోతాయి. అందుకే.. కోతుల మృతదేహాలకు దగ్గరగా వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. దీనివల్ల వచ్చే వ్యాధికే “మంకీ ఫీవర్” అని.. ‘క్యాసనూరు ఫారెస్ట్ డిసీజ్(KFD)’ అని పేరు.

డిసెంబర్ 30 నుంచి వ్యాక్సినేషన్లను శివమొగ్గ జిల్లాలోని పలు వైరస్ ప్రభావిత గ్రామాలకు పంపించామని కర్ణాటక హెల్త్ డిపార్టుమెంట్ తెలిపింది. ఎక్కడైనా కోతి చనిపోతే… దానికి చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో ఈ వ్యాక్సిన్ ను తప్పనిసరిగా ప్రజలు తీసుకోవాలని అధికారులు సూచించారు. జ్వరం వ్యాధి బారిన పడిన అందరికీ ఇంటింటికీ వెళ్లి టెస్టులు చేసి మందులు ఇస్తున్నామన్నారు. చనిపోయిన కోతుల బాడీలకు కనీసం యాభై మీటర్ల దూరంలోనే ఉండాలని హెచ్చరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here