మార్కెట్లోకి మహీంద్రా 8 సీట్ల మరాజో!!

0
108

న్యూఢిల్లీ: దేశీయ ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) తన మల్టీ పర్పస్‌ వెహికిల్‌ మరాజోలో ఎనిమిది సీట్లు కలిగిన కొత్త వేరియంట్‌ను సోమవారం విడుదల చేసింది. ఏడు సీట్ల ఎం8 వెర్షన్‌ దీని ధర రూ.13.9 లక్షలతో పోల్చితే రూ.8,000 అధికమని కంపెనీ తెలిపింది.

కొత్త వెర్షన్‌లో ఏడు అంగుళాల టచ్‌ స్ర్కీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, డైనమిక్‌ గైడ్‌లైన్స్‌తో కూడిన రివర్స్‌ పార్కింగ్‌ కెమెరా, 17 అంగుళాల అలాయ్‌ వీల్స్‌ ఉన్నట్టు మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ చీఫ్‌ విజయ్‌ నక్రా తెలిపారు. మహీంద్రా మరాజో ఎం8 ఎనిమిది సీట్ల కారును నార్త్ అమెరికన్ సెంటర్, చెన్నైకి చెందిన మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ సంయుక్తంగా అభివ్రుద్ధి చేశాయి. ఇటాలియన్ డిజైనింగ్ హౌస్ పినిన్ఫారినాతో కలిసి మహీంద్రా డిజైన్ చేశాయి.

వ్యాపార విశ్వాసం సన్నగిల్లిందని ఆందోళన
వచ్చే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, ఆర్థిక సంస్కరణల కొనసాగింపుపై వ్యాపార, పారిశ్రామిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. దీంతో ఈ ఏడాది చివరి త్రైమాసికం వ్యాపార అవకాశాలపై ఈ వర్గాలు ఏ మాత్రం ఆశాజనకంగా లేవని డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ (డీ అండ్‌ బీ) అనే ఒక అంతర్జాతీయ సంస్థ తన తాజా నివేదికలో పేర్కొంది.

జనవరి-మార్చి 2019 త్రైమాసిక వ్యాపార విశ్వాసంపై ఈ సంస్థ విడుదల చేసిన ‘ది డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ కాంపోజిట్‌ బిజినెస్‌ ఆప్టిమిజం ఇండెక్స్‌’ 81 నుంచి 73.8 శాతానికి పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంతో పోలిస్తే, ఈ ఏడాది మొదటి 3 నెలల్లో 7 శాతం వృద్ధి రేటు కనిపించింది. మిగతా ఐదు విషయాల్లో వ్యాపార విశ్వాసం సన్నగిల్లింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here