బంధువుల వివాహ వేడుకల్లో చిందేసిన సీఎం భార్య, తనయ

0
88

ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత, కుమార్తె దివిజ‌లు డ్యాన్స్ లతో ఇరగదీశారు. ముంబైలోని తమ బంధువుల వివాహ వేడుకల్లో పాల్గొన్న అమృత, దివిజలు డ్యాన్స్ లతో హల్ చల్ చేశారు. బాజీరావ్ మస్తానీ అనే బాలీవుడ్ సినిమాలోని పాటకు స్టెప్పులేస్తూ స్టేజ్ పై దుమ్ముధులిపారు.

అయితే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ లో తల్లీకూతుర్లు ఇద్దరూ ఒకే డ్రస్ వేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇప్పుడు ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మరోవైపు సీఎం సతీమణి అమృత తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఈ డాన్స్ వీడియోను షేర్ చేశారు.

డ్యాన్స్ చూసిన బంధువులు హీరోయిన్ దీపికా పదుకొణే తరహాలో నృత్యం చేశారంటూ ప్రశంసించారు. ఇకపోతే సీఎం సతీమణి అమృత గతంలోనే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ పాటకు నృత్యం చేశారు. అయితే ఈసారి తల్లికి తనయ దివిజ తోడై డ్యాన్స్ లతో అందర్నీ కట్టిపడేశారు.

మరోవైపు అమృత మంచి సింగర్ కూడా. ఇటీవల జరిగిన ఓ వేడుకల్లో అమృత తన గానంతో అందర్నీ ఆకట్టుకుంది. అంతేకాదు పలు ఫ్యాషన్ షోలలో కూడా పాల్గొంది. ఇలా అన్ని రంగాల్లో అమృత తనదైన టాలెంట్ ప్రదర్శిస్తూ అందరి మన్నలను పొందుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here