ఇద్దరు మహిళల దర్శనం నిజమే : సీఎం పినరయి

0
96

శబరిమల అయ్యప్ప గుడిలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించడంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. అయ్యప్ప స్వామిని ఇద్దరు మహిళలు దర్శించుకున్న వార్త వాస్తవమే అన్నారాయన. ఆలయంలో ఏ మహిళ దేవుడిని దర్శించుకోవడానికి వచ్చినా… పోలీసులు వారికి రక్షణ కల్పించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ మేరకు పోలీసులకు అవసరమైన ఆదేశాలు ఇచ్చినట్టు సీఎం పినరయి చెప్పారు.

అయ్యప్ప గుడిలోకి ఇద్దరు మహిళల ప్రవేశంపై కేరళ డీజీపీ లోకనాథ్ బెహరా స్పందించారు. దైవ దర్శనానికి ఎవరు వచ్చినా వారికి రక్షణ కల్పించడమే తమ బాధ్యత అని అన్నారు. వచ్చిన భక్తుల పుట్టినతేదీ, వయసు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం తమకు లేదని ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here