బాలయ్య-తారక్ ల మధ్య ఏముందంటే..? కళ్యాణ్ రామ్ వ్యాఖ్యలు!

0
72

నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య సఖ్యత చెడిందని ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడడం లేదని రకరకాలుగా వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. దీనిపై ఎప్పటికప్పుడు ఈ ఇద్దరు హీరోలు వివరణ ఇస్తున్నా.. రూమర్లు మాత్రం ఆగడం లేదు.

ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా తారక్ ని తీసుకోవాలని బాలయ్య అనుకోలేదని ఇలా ఒకటా రెండా రోజూ ఏవోక వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దీనిపై నందమూరి కళ్యాణ్ రామ్ స్పందించారు. బాలయ్య-తారక్ ల మధ్య ఉన్న రిలేషన్ ని కళ్యాణ్ రామ్ బయటపెట్టాడు.

ఆయన మాట్లాడుతూ.. ”బాబాయ్. తారక్ ల మధ్య రిలేషన్ సరిగ్గా లేదనే వార్తలు నా వరకు కూడా వచ్చాయి. ఇలాంటి వార్తలు ఎక్కడ నుండి పుట్టుకొస్తాయో అర్ధం కావడం లేదు. ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో లాంచ్ తారక్ చేతుల మీదుగా జరిగింది. తారక్ ఇప్పుడొక సూపర్ స్టార్.. తనను తీసుకొచ్చి ఏదొక పాత్రలో పెట్టేసి తన స్టార్ డమ్ కి న్యాయం
చేయగలమని అనుకోలేదు.

బాబాయ్ కూడా తారక్ ని గౌరవించాలని ఆడియో రిలీజ్ ఫంక్షన్ తన చేతుల మీదుగా జరిపించారు. వారిద్దరి మధ్య గొడవలు ఉన్నాయనే వార్తల్లో నిజం లేదు. తారక్ కి ఈ సినిమాలో చిన్న పాత్ర ఇస్తే అభిమానులు కూడా డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆ ప్రయత్నం చేయాలనుకోలేదు” అంటూ చెప్పుకొచ్చాడు. ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో కళ్యాణ్ రామ్ తన తండ్రి హరికృష్ణ పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here