నో కామెంట్ ప్లీజ్.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై కళ్యాణ్ రామ్!

0
81

ఎన్టీఆర్ బయోపిక్ లో నందమూరి హరికృష్ణ పాత్ర పోషిస్తోన్న కళ్యాణ్ రామ్ తాజాగా కొన్ని మీడియా వర్గాలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇందులో ఈ బయోపిక్ గురించి గొప్పగా మాట్లాడడంతో పాటు తారక్, బాలయ్యల గురించి బాగా మాట్లాడాడు.

కానీ ఒక ప్రశ్నకి మాత్రం కళ్యాణ్ రామ్ సమాధానం ఇవ్వలేదు. అదేంటంటే.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. వర్మ రూపొందిస్తోన్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ‘ఎన్టీఆర్’ బయోపిక్ కి పోటీగా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు. ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో దాచేసిన నిజాల్ని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చూపించి తీరతానని అంటున్నాడు వర్మ.

వివాదాలకు కేంద్రబిందువుగా మారనున్న ఈ సినిమాపై కళ్యాణ్ రామ్ కామెంట్ చేయడానికి నిరకారించాడు. పదే పదే అదే ప్రశ్న అడుగుతుంటే.. ‘అలాంటి సినిమాల గురించి మాట్లాడకుండా ఉండడమే మంచిది’ అంటూ తప్పించుకున్నాడు.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కి సంబంధించి నందమూరి హీరోలు ఎలాంటి కామెంట్స్ చేసినా దాన్ని ఇష్యూ చేసుకొని తన సినిమాకి ప్రమోషన్ గా వాడుకోవడానికి సిద్ధంగా ఉంటాడు వర్మ. అందుకేనేమో కళ్యాణ్ రామ్ కూడా ఎలాంటి కామెంట్స్ చేయకుండా జాగ్రత్త పడ్డాడు. మరి బాలయ్య అయినా ఈ విషయంపై మాట్లాడతారేమో చూడాలి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here