క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్: ఇండియాలోనే IPL

0
112

క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్. సాధారణ ఎన్నికలు జరుగనుండటంతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) షెడ్యూల్‌ను రెండు వారాల ముందుకు జరిపింది బీసీసీఐ. అంతేకాదు 12వ సీజన్ IPL ను ఇండియాలోనే  నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల ఉండటంతో భద్రత కల్పించడం సాధ్యం కాదని… టోర్నీని UAE కానీ.. దక్షిణాఫ్రికాకైనా తరలిస్తారని ప్రచారం జరిగింది. అయితే భారత్‌లోనే టోర్నీ నిర్వహించాలని తాజాగా బీసీసీఐ నిర్ణయించింది.

గత సీజన్‌ను ఏప్రిల్ 7 నుంచి ప్రారంభించగా.. ఈసారి అంతకు ముందే ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ను ఆరంభించనుంది. మార్చి 23 నుంచి IPL మ్యాచ్‌లను ప్రారంభించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రతా సంస్థల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది బీసీసీఐ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here