వరుడు జంప్.. అయినా ఘనంగా పెళ్లి

0
74

ముహుర్తానికి సమయం దగ్గరపడుతుంది. వధువు బంధువులు అబ్బాయిని తీసుకుని పెళ్లి మండపానికి వచ్చే క్రమంలో వరుడు మరో అమ్మాయితో జంప్ అయ్యాడు. ఏం చేయాలో అర్ధంకాని పరిస్థితిలో ఉండగా.. వధువుతో అంతకుముందు నిశ్చితార్థం జరిగిన వ్యక్తి పెళ్లి చేసుకునేందుకు ముందుకు రావడంతో కథ సుఖాంతమైంది. వివరాల్లోకి వెళితే.. హుస్నాబాద్‌ మండలం పొట్లపల్లికి చెందిన రజితకు తన మేనత్త కొడుకు పందిపెల్లి శ్రీనివాస్‌ తో వివాహం నిశ్చయమైంది. అతడి తల్లి  పట్టుబట్టడంతో శ్రీనివాస్ ఈ పెళ్లి ఒప్పుకున్నాడు. హుస్నాబాద్‌లోని ఫంక్షన్‌ హాల్లో వధువు తరఫువారు పెళ్లి ఏర్పాట్లు చేశారు.

శ్రీనివాస్‌ కల్యాణ మండపానికి రాకుండా తాను ప్రేమించిన యువతిని తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోయాడు. అర్ధాంతరంగా పెళ్లి ఆగిపోవడంతో రజిత కన్నీరుమున్నీరుగా విలపించింది. అయితే గతంలో తనతో వివాహ నిశ్చితార్థాన్ని రద్దుచేసుకున్న చిన్నములుకనూర్‌ కు చెందిన రమేశ్‌ అనే యువకుడు రజితను పెళ్లి చేసుకుంటానని ముందుకువచ్చాడు. ఇరు కుటుంబాలకు చెందిన వారు వివాహానికి ఒప్పుకోవడంతో అదే వేదికపై రాత్రి పెళ్లి జరిపించారు. అంతకు ముందే శ్రీనివాస్‌ నుస్తులాపూర్‌కు చెందిన మరో యువతితో ప్రేమలో ఉన్నాడు. ఇది తెలిసే తమ కుమార్తెను మొదట ముల్కనూర్‌కు చెందిన పందిపెల్లి రమేశ్‌కు ఇచ్చి వివాహం చేసేందుకు వధువు తల్లిదండ్రులు నిర్ణయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here