శబరిమలలోకి మరో ఇద్దరు మహిళలు.. అడ్డుకున్న ఆందోళనకారులు

0
96

ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల మరోసారి ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఇప్పటికే కొందరు 50ఏళ్లలోపు మహిళలు.. పోలీసుల రక్షణతో ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే వివాదం నడుస్తూ ఉంది. తాజాగా.. మరో ఇద్దరు మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు.

కాగా.. ఆ మహిళలు ఇద్దరినీ ఆందోళనకారులు అడ్డుకున్నారు. మొత్తం 9మంది సభ్యులతో కూడా బృందం ఒకటి అయ్యప్పను దర్శించుకోవడానికి రాగా.. అందులో 50ఏళ్లలోపు వయసుగల ఇద్దరు మహిళలు ఉన్నారు. వారు పంబా బేస్ క్యాంప్ వద్దకు చేరుకోగానే.. ఆందోళనకారులు అడ్డుకున్నారు.

కాగా వారిలో ఒక మహిళ మాట్లాడుతూ.. తనకు చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయని ఆమె తెలిపారు. వాళ్లు ఇంకా బెదిరించాలని ప్రయత్నిస్తే.. తాను కచ్చితంగా వెనుదిరిగి వెళ్లనని ఆమె తేల్చి చెప్పారు.

కాగా.. ఆలయంలోకి  వెళ్లడానికి ప్రయత్నించిన మహిళలను అడ్డుకోవడం విషయంపై ప్రముఖ సామాజిక కార్యకర్త రాహుల్ ఈశ్వరన్ చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదమైంది. ఆయన తన ట్వీట్ లో హిందూ ధర్మాన్ని కాపాడామంటూ పేర్కొన్నారు. ఆందోళనలతో ఇద్దరు మహిళలను ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నామంటూ ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here