మరింత ఆలస్యం: కేబినెట్ విస్తరణకు కోడ్ బ్రేక్

0
84

పంచాయతీ ఎన్నికల కోడ్‌ మంగళవారం నుంచి అమల్లోకి రావడంతో మంత్రివర్గవిస్తరణ మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. అయితే ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు అసెంబ్లీని సమావేశపరిచే అవకాశం ఉంది. దీనికి రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి. ఆగిన చెక్కుల పంపిణీ బతుకమ్మ చీరలు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ ‌చెక్కుల పంపిణీ వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది.

CMRF చెక్కుల పంపిణీ కూడా తాత్కాలికంగా నిలిపివేయాలని, అత్యవసరం అయితే అనుమతి తీసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. IAS,IPS,IFS అధికారుల బదిలీలు చేపట్టొద్దని, తప్పనిసరైతే అనుమతి కోరాలంది. పాలక మండళ్లు మనుగడలో ఉన్నచోట్ల జిల్లా, మండల, మున్సిపల్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చు.

చెక్‌పోస్టుల ఏర్పాట్లు జిల్లా, రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌‌పోస్టులు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిరయించింది. దీనికి సంబంధించి రెవెన్యూ, పోలీస్‌ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏర్పాటు చేసిన చెక్‌‌పోస్టులకు అదనంగా మరికొన్ని ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. ఒక వ్యక్తి రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లొద్దని స్పష్టం చేసింది. అంతకంటే ఎక్కువ నగదు కలిగి ఉంటే ఆధారాలు చూపించాలి. ఇక ఎన్నికల నిర్వహణపై ఫిర్యాదుల కోసం ఒక సెల్‌ను ఏర్పాటు చేయనున్నారు.

ఎన్నికల సంఘం అబ్జర్వర్లుగా ఎంపిక చేసిన 26 మంది IAS అధికారులతో కమిషనర్‌ వీ.నాగిరెడ్డి శుక్రవారం సమావేశం కానున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here