రెండో వన్డే: 189 పరుగుల వద్ద ఆసీస్ ఐదో వికెట్ డౌన్

0
93

కీలకమైన రెండో వన్డే మ్యాచులో ఆస్ట్రేలియా భారత్ పైల 82 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఖవాజా 21 పరుగులు చేసి రన్నవుట్ అయ్యాడు. 134 పరుగుల స్కోరు వద్ద ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హ్యాండ్స్ కోంబ్ జడేజా బౌలింగులో అవుటయ్యాడు. ఆస్ట్రేలియా 189 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. మొహమ్మద్ షమీ బౌలింగులో ధోనీకి క్యాచ్ ఇచ్చి స్టోయిన్స్  29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.

ఆడిలైడ్: మూడు మ్యాచుల సిరీస్ లో భాగంగా ఆడిలైడ్ లో ప్రారంభమైన రెండో వన్డేలో టాస్ గెలిచి భారత్ పై ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆదిలోనే ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయింది.

ఆస్ట్రేలియా 26 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆరోన్ ఫించ్ 19 బంతుల్లో 6 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగులో అవుటయ్యాడు. కారే 27 బంతుల్లో 18 పరుగులు చేసి మొహమ్మద్ షమీ బౌలింగులో ధావన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు.

ఆస్ట్రేలియా తొలి వన్డేలో విజయం సాధించి 1-0 ముందంజలో ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచు కూడా ఆస్ట్రేలియా గెలిస్తే సిరీస్ గెలుచుకుంటుంది. భారత్ విజయం సాధిస్తే మూడో వన్డే కీలకంగా మారుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here