వైసీపీలో చేరిన సినీనటుడు భానుచందర్

0
159

శ్రీకాకుళం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సినీ ఇండస్ట్రీ క్యూ కడుతోంది. ఇప్పటికే టాలీవుడ్ నుంచి పలువురు నటులు వైసీపీ తీర్థం పుచ్చుకుని జగన్ వెంట నడుస్తున్నారు. మరికొందరు తెరవెనుక ఉంటూ జగన్ కు మద్దతుగా నిలుస్తున్నారు.

తాజాగా వీరికోవలోకి అలనాటి సీనీ హీరో భాను చందర్ చేరిపోయారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు ఇచ్చాపురం చేరుకున్న భానుచందర్ వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ కండువా కప్పి భానుచందర్ ను పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్.

భానుచందర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కొద్ది రోజుల క్రితమే రెడీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న వైఎప్ జగన్ ను గత ఏడాది డిసెంబర్ 23న భానుచందర్ కలిశారు. ఆనాడే తాను పార్టీలో చేరే విషయంపై చర్చించారు.

ఏడాది కాలంగా వైఎఎస్ జగన్ పాదయాత్ర చెయ్యడం అభినందనీయమన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జగన్ చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని భాను చందర్ కోరారు. కాసేపు వైఎస్ జగన్ అడుగులో అడుగు వేస్తూ భానుచందర్ పాదయాత్రలో పాల్గొన్నారు.

ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు పలువురు సినీనటులు మద్దతు పలికారు. నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళీ, పృథ్వి, ఫిష్ వెంకట్, చోటా కె నాయుడు, సినీనటుడు కృష్ణుడు, జబర్దస్త్ టీం కలిసి తమ సంఘీభావం ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here