శబరిమలలోకి ఇద్దరు మహిళల ఆలయ ప్రవేశం (వీడియో)

0
191

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మొట్టమొదటిసారిగా ఇద్దరు మహిళలు శబరిమల ఆలయ ప్రవేశం చేశారు. రుతుస్రావం వయస్సు కలిగిన మహిళలు ఆలయ ప్రవేశం చేయడంతో దశాబ్దాలపాటు కొనసాగుతున్న ఆలయ చరిత్రను తిరగరాసినైట్లెంది. 40 ఏళ్లలోపు వయసు గల బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు ఈ రోజు ఉదయం ఆలయ ప్రవేశం చేశారు.

కొండపై అర్ధరాత్రి నడకను కొనసాగించి ఈ తెల్లవారుజామున 3.45 గంటలకు అయ్యప్ప స్వామికి దర్శించుకుని ప్రార్థనలు చేసిన అనంతరం వెనుతిరిగారు. యూనిఫాం, సివిల్ డ్రస్సుల్లో ఉన్న పోలీసులు ఈ ఇద్దరూ మహిళలకు రక్షణగా నిలిచారు. గడిచిన డిసెంబర్ నెలలో సైతం ఆలయ ప్రవేశం చేయడానికి ఈ ఇద్దరు మహిళలు ప్రయత్నించగా తీవ్ర నిరసనల మధ్య వెనుతిరిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here